Monday, March 23, 2026

జమ్మికుంటలో పారిశుధ్య లోపం

  • నిమ్మకు నీరెత్తనట్టు మున్సిపల్ అధికారులు
  • చేత్త చదరాలతో నిండుతున్న వార్డులు
  • ఎన్నిసార్లు విన్నవించుకున్న స్పందించని మున్సిపల్ సిబ్బంది

నేటి సాక్షి, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని 6వ వార్డులో ఉన్నటువంటి వార్డు దుస్థితి జమ్మికుంట మున్సిపల్ సిబ్బంది చూసి చూస్తున్నట్టుగా గత 15 రోజులుగా వార్డులో మురికి కాలువలు శుభ్రత అనేది లేకుండా పోయింది. అక్కడి వార్డ్ ప్రజలు తమ యొక్క ఆవేదనను మున్సిపల్ కమిషనర్ కు మరియు సిబ్బందికి మరియు వార్డ్ జవాన్ కు మరియు వార్డు ఇన్చార్జి కి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా విని పట్టనట్టుగా వవ్యవహరిస్తున్నారు. మరి అక్కడ 6 వ వార్డులో మసీదు ముందు ఖాళీ స్థలంలో చెత్త ఉండడం వల్ల అక్కడ ఉన్న రైల్వే ట్రాక్ అనుకున్న మోరి దుర్వాసన ద్వారా దోమలు, పాములు చిన్న చిన్న తేళ్లు ఉండటం వలన చుట్టూ పక్కన ఇండ్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు ఫోన్ ద్వారా నగర పంచాయతీ కమిషనర్ కు ఫోన్ ద్వారా చెప్పినా కూడా వారి సమాధానం అక్కడి ఫోటోలు గాని అక్కడి వీడియోలు గాని నాకు పంపగలరని అనడం తప్ప కార్మికులను పంపించి అక్కడ ఉన్నటువంటి మోరీలో చెత్త, చెట్లను తొలగించడం, శానిటైజర్, బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేపించడం లేదు. ఇంటి నల్లా పన్నులు వసూలు చేయడంలో చూపే శ్రద్ధ శుభ్రత పై కూడా చూపాలని ఇప్పటికైనా దీనిపై వెంటనే కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోగలరని ప్రజలు అభ్యర్థిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News