నేటి సాక్షి, మందమర్రి:– అఖిలభారత కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవాదళ్ నాయకులు మాట్లాడుతూ, జాతీయ సార్వభౌమత్వానికి ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ఆనవాయితీగా వస్తున్న పరంపర అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐదు ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ డాక్టర్ నీలకంఠేశ్వర రావు గౌడ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు హఫీజ్ ఉర్ రెహ్మాన్, సేవాదళ్ పట్టణ అధ్యక్షుడు సోత్కు ఉదయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి జామల్పూరి నర్సోజి, సేవాదళ్ బ్లాక్ అధ్యక్షుడు పలిగిరి కనకరాజు, కాంగ్రెస్ నాయకులు మంద తిరుమల్ రెడ్డి, దుర్గం నర్సయ్య, పైడిమల్ల నర్సింగ్, ఎర్ర రాజు, మేకల శంకర్, రాజేష్, ధనుక్, అజయ్, వంశీ, స్వామి, కుమార్ లు పాల్గొన్నారు.





