Monday, March 23, 2026

క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం

నేటి సాక్షి, మందమర్రి:- విద్యార్థుల భవిష్యత్తు ఎదుగుదలకు క్రీడలు ముఖ్యమని, తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలని, క్రీడలతో శారరీకంగా మానసికంగా దృఢత్వాన్ని కలుగుతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్, దారా రవి సాగర్ తెలిపారు. పట్టణంలోని సిఐఎస్ఎఫ్ బ్యారెక్స్ లో తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు రెండవ రోజు ఆదివారం కొనసాగాయి. రెండవ రోజు పోటీలను బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, దారా రవి సాగర్, రజిని దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై, పోటీలను ప్రారంభించారు. రెండవ రోజు పోటీలకు వివిధ జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్, రవి సాగర్ లు మాట్లాడుతూ, రానున్న బిజెపి ప్రభుత్వంలో ప్రతి పాఠశాలలో కరాటేను తప్పనిసరి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రంగు శ్రీనివాస్, మాయ రమేష్, బిజెపి నాయకులు రజనీష్ జైన్, అక్కల రమేష్, దుర్గం అశోక్, డివి దీక్షితులు, సప్పిడి నరేష్, కరాటే మాస్టర్లు హరికృష్ణ, భూమయ్య, సంతోష్, పోచంపల్లి వెంకటేష్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News