Monday, March 23, 2026

విభిన్న ప్రతిభావంతునికి బ్యాటరీ కం ఎలక్ట్రికల్ వీల్ చైర్ పంపిణీ

  • బ్యాటరీ కం ఎలక్ట్రికల్ వీల్ చైర్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి, విభిన్న ప్రతిభావంతునికి బ్యాటరీ కం ఎలక్ట్రికల్ వీల్ చైర్ ను పంపిణీ చేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టరేట్ నందు వలమల వెంకటేశ్వర్, కొండల్లో ఆధవరం గ్రామం, కెవిబి పురం మండలం, సత్యవేడు నియోజకవర్గ వాస్తవ్యుడైన విభిన్న ప్రతిభావంతునికి అధునాతన వీల్ చైర్ ను కలెక్టర్ అందచేశారు. తాను విభిన్న ప్రతిభావంతుడని తనకు వీల్ చైర్ సాయం చేయమని గౌరవ ముఖ్యమంత్రిని వారి పర్యటనలో కోరిన నేపథ్యంలో సీఎం గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ వారి ద్వారా చెన్నై నుండి సుమారు 60 వేల రూపాయల విలువ గల అత్యాధునిక బ్యాటరీ కం వీల్ చైర్ ను తెప్పించి నేడు సదరు విభిన్న ప్రతిభావంతునికి అందచేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సదరు వ్యక్తి తన అమితమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తనకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా కలెక్టర్ కు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ శ్రీనివాస్ తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News