Monday, March 23, 2026

తహసిల్దార్ కార్యాలయాలలో రాజ్యమేలుతున్న అవినీతి..!

  • చిన్న స్థాయి ఉద్యోగి నుంచి తహసిల్దార్ వరకు పైసా లేనిదే పని కాదు
  • అవినీతికి కేరాఫ్ తహసిల్దార్ కార్యాలయాలు
  • ముడుపులు అందజేస్తే.. చకచకా పనులు
  • ప్రైవేట్ వ్యక్తులతో వసూళ్లు
  • తహసిల్దార్ కార్యాలయాలకు వెళ్లాలంటేనే జంకుతున్న‌ సామాన్యులు
  • దళారులను, పైరవీకారులను కలిశాకే పనులు
  • పనికో రేటు.. లేదంటే రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే
  • నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినా .. చేతులు తడపనిదే పని కావడం లేదంటున్న బాధితులు
  • లేకపోతే ఏదో రకంగా కొర్రీలు పెట్టి పని ఆపేస్తున్నారని ఆరోపణ
  • వేలల్లో జీతాలు తీసుకుని ఉద్యోగులు ఇలా బరితెగించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : సూర్యాపేట జిల్లా పరిధిలోని మండలాల తహసిల్దార్ కార్యాలయాలలో అవినీతి రాజ్యమేలుతుంది పైసలు చేతిలో పడందే పనులు కావడం లేదు. రోజు రోజుకి ప్రజలను పీడించే అధికారులు ఎక్కువవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా తహసిల్దార్ కార్యాలయాలు మారుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. దళారులు పైరవీకారులు లేనిదే కార్యాలయాలలో పనులు జరగవని కచ్చితంగా దళారితో వెళితే మాత్రమే పనులు జరుగుతాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ధరణి వచ్చిన తర్వాత దళారులు ఎక్కువయ్యారని. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఏ పని కావాలన్నా పైరవీకారులు చెప్పాలి. అధికారులకు ముడుపులు అందజేస్తే ఏ పని అయినా సాధ్యం అనే సలహాలు పనులు జరుగుతున్నాయి. పైసా లేనిదే పని కాదు చిన్న స్థాయి ఉద్యోగి నుంచి అధికారికి ముడుపులు చెల్లించాల్సిందే. రెవెన్యూ కార్యాలయంలో ఎవరికి ఒక్క పైసా కూడా లంచం ఇవ్వద్దని ఉన్నంత అధికారులు చెబుతున్నా మండలాల తహసిల్దార్ కార్యాలయాలలో అధికారుల పని తీరు మాత్రం మారడం లేదు. ఫలానా ధ్రువపత్రాలను ఫలానా గడువులోగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. కానీ అధికారులు మాత్రం డబ్బు కోసం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారు. ఆన్లైన్ లో ఆర్జి చేసుకున్న తర్వాత ధ్రువపత్రాల కోసం నెలలు తరబడి తహసిల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడమే జరుగుతుంది. రైతులు భూమి గురించి ఆర్జీ చేసుకున్నాక రిజిస్ట్రేషన్ చేయవలసింది పోయి వివిధ రకాల కారణాలు చెబుతూ పట్టాలు చేయడం లేదు. డబ్బులు ఇస్తేనే రైతుల పేరు మీద మార్పిడి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచం ఇచ్చిన ఆర్జీదారుని సమస్యను పరిష్కరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News