నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్ర సందర్భంగా ఎటువంటి శబ్ద కాలుష్యం లేకుండా డీజే లు వినియోగించకుండ సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయాత్రను ఘనంగా నిర్వహించినందుకు సోమవారం వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడు అరుణ్ మరియు పట్టణ అధ్యక్షుడు నందు మరియు యువకులకు అభినందించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇక ముందు జరిగే వినాయక చవితి ఉత్సవాలలో, నిమజ్జన కార్యక్రమాలో కూడా డిజె లాంటివి మ్యూజిక్ నివారించి సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు , చెక్కభజన,కోలాటం వంటి ప్రోత్సహించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు వ్యక్తిగత అభివృద్ధి పెంపొందించుకుంటూ సమాజ సేవలో పాల్పంచుకోవాలని సూచించారు…ఈ సమావేశం తర్వాత వనపర్తి జిల్లా ప్రజల భద్రత ను కాపాడుతున్న , గంజాయి మరియు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోప్తున్న ఎస్పీ గిరిధర్ గారికి శాలువాతో సన్మంచిన యువకులు అరుణ్ , నంద , మల్లికార్జున్, అఖిల్ , దివాకర్ తదితరులు పాల్గొన్నారు.





