Monday, March 23, 2026

ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : పట్టణంలోని శివ మార్కండేయ ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం ప్రముఖ వ్యాపారి బొప్ప రాతి లక్ష్మణ్ వారిద్దరి కుమారులు కలిసి మార్కండేయ దేవాలయ గర్భగుడి విగ్రహాల కోసం మరియు గ్రానైట్ కోసం ఆరు లక్షల ముప్పై అయిదు వేల రూపాయలు భారీ విరాళాన్ని సోమవారం అందించారు.వారు శ్రీ శివ భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణంలో మహారాజ పోషకులుగా సభ్యత్వం తీసుకోవడం జరిగింది.ఈ సందర్బంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ధ్యావనపల్లి రాజారాం మాట్లాడుతూ శివ భక్త మార్కండేయ ఆలయ నిర్మాణ పనుల కోసం అత్యధికంగా ఆరు లక్షల ముప్పై ఐదు వెల రూపాయల విరాళం ఇచ్చిన భూపతి లక్ష్మణ్ గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు, సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ద్యావనపల్లి రాజారాం, ఉపాధ్యక్షులు సంకు ఆనంద్, అన్నం నాగరాజ్, బేతు భాస్కర్, నడికట్ల సత్యనారాయణ, వాసాల నరేష్, గురుడు హన్మాండ్లు, వడ్డేపల్లి చిన్న చిన్నయ్య, రాంపల్లి శ్యామ్,అడేపు రమణ,పసునూరి వివేకానంద్,గాజంగి శ్రీనివాస్, రాంపల్లి పరంధాము, కుడిక్యాల గంగాధర్,గురుడు రాంప్రసాద్,వంగరి ద్విజేంద్రనాథ్,బేతు దుర్గాప్రసాద్,ద్యావనపల్లి మణి,గుండేటి కన్నయ్య,ద్యావనపల్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News