- ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ఎం.డి. – గౌతమ్
- సూర్యాపేట జిల్లా కలెక్టర్ – తేజస్ నందలాల్ పవర్

నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు క్రింద అమలైన ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపనను సోమవారం పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ఎండి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ వారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తో మాట్లాడుతూ. మధ్యవర్తులను ఆశ్రయించవద్దని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో విడతల వారీగా జమ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, మండల స్పెషల్ ఆఫీసర్ శిరీష, తహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, హౌసింగ్ ఇంజనీర్ మూర్తి, కార్యదర్శి రాము నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.





