Monday, March 23, 2026

బొగ్గు బావులను వేలం పాట వేసిన బీజేపీ పార్టీకి బుద్ది చెప్పండి

  • పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించాలి
  • సిపిఎం బలపర్చిన పట్టభద్రుల అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి, ఉపాధ్యాయుల అభ్యర్థి వై అశోక్ కుమార్ లను గెలిపించాలి
  • సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- బొగ్గు బావులను వేలం పాట వేసిన బీజేపీ పార్టీకి బుద్ది చెప్పాలని, పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించాలని, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ అధ్వర్యంలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ, కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెందవలసిన మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వేలం పాట పేరుతో కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం కోసం హైదారాబాద్ లో వేలం పాట నిర్వహించడం జరిగిందని అన్నారు. కార్మిక వర్గ శ్రమను కారు చౌకగా దోపిడీ సంస్థలు దోషుకోవడం కోసం కార్మిక చట్టలను రద్దు చేసిందని తెలిపారు. నిరుద్యోగ యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, 7 సంవత్సరాలు గడిచిన ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. మంచిర్యాలలోని శాలివాన ఫవర్ ప్లాంట్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి, కార్మికులను, వారి కుటుంబ సభ్యులను వీది పాలు చేసి, కార్మికులను, నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించిన యజమానిని ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నుంచి నిలబెట్టడం చూస్తే మంచిర్యాల జిల్లాలో ఎం చెయ్యాలని చూస్తున్నారో ఓటర్లు అర్దం చేసుకోవాలని అన్నారు. తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ లు, 8 ఎమ్మెల్యేలు ఉన్న కేంద్ర బడ్జెట్ లో నుంచి ఒక్కరూపాయి కూడ రాష్ట్రానికి, మంచిర్యాల జిల్లాకు తీసుకురాలేదని అన్నారు. జిల్లాలోని పట్టభద్రులు, ఉపాధ్యాయుల బీజేపీ అభ్యర్థులను ఓడించగలని, సీపీఎం బలపర్చిన పట్టభద్రుల అభ్యర్థి వుత్కూరి నరేందర్ రెడ్డి, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్ లను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోమసా ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు, దుంపల రంజిత్ కుమార్, గుమశా అశోక్, నాయకులు చల్లురి దేవదాసు, డి మోహన్, ఈ అభినవ్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News