నేటిసాక్షి కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ మరియు మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల, కే జి బి వి పాఠశాలల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు జగిత్యాల ప్రభుత్వ దవాఖానా లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఆర్ బి ఎస్ కే కార్యక్రమంలో భాగంగా ఉచితంగా కంటి పరీక్షలు చేస్తుందని, అవసరమైన విద్యార్థులకు కంటి అద్దాలు మందులు ఉచితంగా అందచేస్తుందని ప్రభుత్వం అందించే ఉచిత కంటి పరీక్షలు వైద్యాన్ని విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. 20 మంది విద్యార్థినీ ,విద్యార్థులను పాఠశాలనుండి జిల్లా ప్రధాన దవాఖానకు ఆర్ బి ఎస్ కే వాహనం లో తీసికెళ్ళి తిరిగి తీసుకురావడం జరిగింది. కంటి పరీక్షలు అవసరం ఉన్న విద్యార్థులను ఆయా పాఠశాలల నుండి కొన్ని రోజులవరకు తీసుకుని పోయి పరీక్షిస్తామని తల్లి తండ్రులు ఉపాద్యాయులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మహేష్, డా . సుష్మా,ఫార్మశిస్ట్ ప్రియ , ఏ ఎన్ ఎం సరిత, లక్ష్మి నారాయణ , లక్ష్మణ్ వైద్య సిబ్బంది ఉపాద్యాయులు సత్యానందం విద్యార్థులు పాల్గొన్నారు.





