నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 10 మంది బాధితుల ఫిర్యాదులను జిల్లా ఎస్పీ గారు క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలకు సంబందించిన పిర్యాదులు , కొడుకులు తల్లిదండ్రులు లను చూడక పోవడం, అన్నదమ్ముల మధ్య బాగా పరిష్కార పిర్యాదులు, లైంగిక వేధింపులకు సంబంధించిన పిర్యాదులు మరియు భర్త వేదింపులకు సంబంధించిన ఫిర్యాదులను ఎస్పీ గారు పరిశీలించారు. ఫిర్యాదులపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత ఎస్సై లను, సీ.ఐ లను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్పి శ్రీ వై.మోగిలయ్య పాల్గొన్నారు.





