Monday, March 23, 2026

చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు

  • స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పులివర్తి నాని

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి: తిరుపతి రూరల్ మండలం పరిధిలోని సి.గొల్లపల్లి గ్రామంలో వెలసిన శివకోటి శివాలయం శ్రీ ప్రసన్న పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. దర్శన అనంతరం శాలువాతో సత్కరించి, వేద పండితుల ఆశీర్వదించనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న శివాలయాలలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఆలయాలకు వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా వారికి దర్శన ఏర్పాట్లతో పాటుగా త్రాగునీరు అన్నప్రసాద వితరణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు, ధర్మకర్తల మండలి సభ్యులను కోరారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని శివుని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, నాయకులు మధు నాయుడు, వైకుంఠం శ్రీధర్ నాయుడు, శ్రీనివాసులు కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు,భక్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News