నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : ఫిబ్రవరి 25: ఆర్థిక సహాయం అందించిన దాతలకు వారి కుటుంబాలకు అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు – బి ఆర్ కె న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు. దాతల సహకారంతో వచ్చిన 64,000/- రూపాయలను కర్నూల్ హాస్పటల్లో బాధితురాలు భర్తకు అందించిన బి ఆర్ కె న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు. జోగులంబ గద్వాల జిల్లా, గద్వాల పట్టణానికి చెందిన జి. కవిత అంగన్వాడీ టీచర్ బైక్ పైనుంచి కిందపడి బ్రెయిన్ ఆపరేషన్ చేసి కోమాలో ఉన్న విషయాన్ని బి ఆర్ కె న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు దృష్టికి తీసుకురాగా మానవసేవయే మాధవసేవ గ్రూప్ మరియు సోషల్ మీడియాలో ఇట్టి విషయాన్ని తెలపడంతో మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థిక సహాయం అందించిన దాతలకు బాధిత కుటుంబ సభ్యుల తరఫున నుంచి మరియు బి ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు అయినటువంటి నా తరఫునుంచి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాతల సహకారంతో వచ్చిన 64,000/- రూపాయలను కర్నూల్ హాస్పిటల్ లో బాధితురాలు భర్తకు అందించడం జరిగింది. గడచిన కొంతకాలం క్రితం కూడా మానవసేవయే మాధవసేవ గ్రూప్ మరియు సోషల్ మీడియా ద్వారా అనారోగ్యాల కారణల వల్ల చిన్న పిల్లలకు – పెద్ద వాళ్లకు కూడా దాతలు అనేక సందర్భాల్లో ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. ముందు ముందు కూడా ఇలాంటి విషయాలను మానవసేవయే మాధవసేవ – సోషల్ మీడియా ద్వారా అనేక కార్యక్రమాలకు మీ అందరి ఆ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి *ఆర్థిక సహాయం అందించిన దాతలకు వారి కుటుంబ సభ్యులకు అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము.




