Monday, March 23, 2026

విద్యతోపాటు క్రీడలు సాంకేతిక రంగాలలో రాణించి దేశ ప్రతిష్టను మరింత పెంచాలి

  • డాక్టర్ రామచంద్రారెడ్డి

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడలు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి దేశ ప్రతిష్టను మరింత పెంచాలి డాక్టర్ రామచంద్రారెడ్డి అన్నారు. మండలంలోని వెంకట్రామాపురం లో ఉన్న సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాల లో మంగళవారం ప్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథిగా హాజరైన ఎస్ ఐ రామాంజనేయులు మాట్లాడుతూ.. భావితరాలకు దిక్సూచి నేటి విద్యార్థులేననన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిరంజన్ బాబు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, ఏకాగ్రత కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు విద్యతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా హాజరైన స్పిన్ కో బయోటెక్ కంపెనీ కి చెందిన గోపీనాథ్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే ప్రతి విద్యార్థి సమాజానికి ఉపయోగపడే విధంగా ఆలోచిస్తే నవ సమాజం స్థాపనకు మూల పురుషుడు విద్యార్థులే అన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News