నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్ టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణం ఎక్సైజ్ శాఖ పరిధిలోని, వైన్ షాపులు, బార్ షాపులు, కల్లు షాపుల యజమాన్యాలకు, ఎల్లారెడ్డి ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ ఈనెల 25 నుండి 27 వరకు షాపులు తీయరాదని హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా విక్రయాలకు పాల్పడితే చట్టరీత్యాతకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎం.ఎల్.సి ఎలక్షన్స్ సందర్బంగా ఎల్లారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోగల వైన్ షాప్ లు, బార్,కల్లు డిపో లు, కల్లు దుకాణాలు, ఈ రోజు అనగా తేదీ 25-02-2025 సాయంత్రం 4 గంటల నుండి, తేదీ 27-02-2025 సాయంత్రం 4 గంటల వరకు మూసి వేయాలని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయబడింది. కావున, నిబంధన లు ఉల్లంగించిన చో చర్యలు తీసుకోబడును. ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ SHO ఎల్లారెడ్డి.




