నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్ టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారం, ఈరోజు ఎల్లారెడ్డి మండలం లోని, వెల్లుట్ల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ వుట్కరి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్ల ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కిరణ్,గ్రామ అధ్యక్షుడు యమా రాజయ్య, గ్రామ యూత్ అధ్యక్షుడు స్వామి తదితరులు పాల్గొన్నారు.




