- రేవంత్ రెడ్డి
నేటిసాక్షి నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులు, పిసిసి అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారుల సమక్షంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఓటర్స్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. క్రిస్టియన్స్‌గా కన్వర్ట్ అయిన, ఎస్సీలు కూడా బీసీ-సి గ్రూప్ కింద ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన సర్వేలో కులగణన లెక్కలు పూర్తయితే, ఎవరికి ఏం రావాలో అది అడుగుతారనే భయంతోనే బీజేపి, బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని అన్నారు. “ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు అని తప్పుడు మాటలు మాట్లాడకుండా ఏ రకంగా తప్పో చెప్పండి” అని ఆయన ప్రతిపక్షాలను నిలదీశారు. ఏ బ్లాకులో, ఏ ఇంట్లో, ఏ కులాన్ని ప్రభుత్వం తప్పుగా రాసుకొచ్చిందో కులగణను తప్పుపట్టే వారు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేది అంత ఆషామాషి విషయం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కులగణన గణాంకాలు పూర్తి చేస్తే… దేశచరిత్రలో తన పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీనవర్గాల లెక్క పక్కాగా తేల్చారు అని దేశమంతా రాబోయే రోజుల్లో చెప్పుకుంటుందన్నారు.




