Monday, March 23, 2026

జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

నేటసాక్షి బ్యూరో, నిజామాబాద్ టి.ఎన్ రమేష్ : కరీంనగర్, నిజాంబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా, ఎల్లారెడ్డి లోని బిజెపి కార్యాలయంలో ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఓటర్ల ముఖ్య సమావేశంలో, ముఖ్య అతిథిగా బిజెపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీ డి కె అరుణ పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో, ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మీడియాకి వివరించారు. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో జరుగుతున్న mlc ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే, కాంగ్రెస్ అరాచకాలను మండలిలో ప్రస్తావించి సమస్యల పరిష్కారం కోసం పాటు పడతారని డీకే అరుణ అన్నారు. మీడియా సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యులు, బి.బి పాటిల్, జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, జిల్లా ఇన్చార్జి పెద్దోళ్ల గంగారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి ఎన్ హైమావతి రెడ్డి, టీచర్ల ఇన్చార్జి పూసల రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, మర్రి రామ్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News