- భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీ దే
- విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్
- గులాబీ శ్రేణులు కష్టించి పని చేయాలి
నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది గులాభీ జెండా. తెలంగాణ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసింది తొలి సిఎం కేసీఆర్ బి. ఆర్ ఎస్ శ్రేణులు గులాబీ పార్టీ పటిష్టత గెలుపే లక్ష్యంగా పనిచేయాలని. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీలో బిఆర్ఎస్. విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోరుకంటి చందర్ టిఆర్ఎస్ శ్రేణులు ఉద్దేశించి మాట్లాడారు. అబద్దాల హామిలతో గద్దెనేక్కినా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. రాబోయే రోజులు మనవే నని గులాబీ శ్రేణులు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని చందర్ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన టిఆర్ఎస్ లోనే కొనసాగుతున్న శ్రేణు ల నిబద్ధత ఎంతో గొప్పదన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను గ్రామ ప్రతి ఇంటికి వివరించాల్సిన అవసరం ఉందని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతి పల్లెలో గులాబీ శ్రేణులు కలియతిరగాలని, బిఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. రాష్ట్ర సాధన ఉద్యమమే లక్ష్యంగా తాము పని చేశామని అయితే పదవుల కోసం మాత్రం ఉద్యమంలో తిరగ లేదని చెప్పారు. పదవులే ప్రధానంగా, హోదలే లక్ష్యంగా ఉద్యమ పార్టీలో తిరగడం సాధ్యం కాదని పేర్కొన్నారు. విస్తృతస్థాయి సమావేశంలో ప్రజాక్షేత్రంలో టిఆర్ఎస్ శ్రేణులు తీసుకోవాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణ పై నేతలు, శ్రేణులతో కోరు కంటి చందర్. సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో కార్యక్రమం లో బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మూల విజయ రెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు మాజీ జడ్పిటీసీ అముల నారాయణ మాజీ కార్పోరేటర్లు పెంట రాజేష్ పాముకుంట్ల భాస్కర్ కుమ్మరి శ్రీనివాస్ గాధం విజయ కల్వచర్ల కృష్ణ వేణీ బాదె అంజలి ముదాం శ్రీనివాస్, గోపు అయులయ్య. నడిపెల్లి మురళీధర్ రావు. యాదవ్ అచ్చ వేణు.నూతి తిరుపతి. రాకం వేణు. జె .వి.రాజు, బోడ్డు రవీందర్,బోడ్డుపల్లి శ్రీనివాస్. కాల్వ శ్రీనివాస్. చెలకలపల్లి శ్రీనివాస్. మేతుకు దేవరాజ్.కన్నూరి సతీష్ కుమార్. కొలిపాల మధుకర్ రెడ్డి.బండారి ప్రవీన్.ఆర్శనపల్లి శ్రీనివాస్. తుంగపిండి సతీశ్. మెరుగు పోశం. జక్కుల తిరుపతి . మామిడాల ప్రభాకర్. కొల లత. పిల్లి రమేష్, తోట వేణు. మేడి సదానందం, బోబ్బలి సతీష్, కుడుదుల శ్రీనివాస్,మాదాసు రామమూర్తి. నిట్టూరి రాజు మహేందర్ ఆవునూరి వెంకటేష్ కొడి రామకృష్ణ చల్లా రవీందర్ రెడ్డి ఆడప శ్రీనివాస్, సత్యం సట్టు శ్రీనివాస్, వీరాలాల్ నీరటి శ్రీనివాస్, ప్రశాంత్ ముదిరాజ్, యాసర్ల తిమెాతి , ముద్దసాని సంధ్యా రెడ్డి, కిరణ్ రామారాజు, స్వప్న తదితరులు పాల్గొన్నారు.




