Monday, March 23, 2026

ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని గెలిపించండి

నేటి సాక్షి, మెట్ పల్లి : కాంగ్రెస్ ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని గెలిపించాలని పీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్కూరి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని పట్టా భద్రుల సమస్యలు పరిష్కారానికి ఆయన కృషి చేస్తారని అన్నారు.నరేందర్ రెడ్డి కి పట్టభద్రుల సమస్యలు అవగాహన ఉన్నదని. యువత తప్పకుండా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల తరఫున ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, టీపీసీసీ ఫిషేర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా,మల్లాపూర్ మండల అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందె మారుతీ, దామెర రాజశేఖర్ రెడ్డి, అశోక్,జిల్లా యూత్ మీడియా కో ఆర్డినేటర్ కూన రాకేష్,యూత్ నియోజకవర్గ సెక్రటరీ అమ్ముల పవన్,మాజీ ఎంపీటీసీ సుదర్శన్,యండి జాఫర్, మామిడి రాజశేఖర్ రెడ్డి,ఇప్పపల్లి గణేష్,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News