- ఈనెల 26 నుండి మార్చి 02 వ తారీకు వరకు జరగనున్న జాతర
- ఐదు రోజుల జాతరకు వేలాదిగా తరలి రానున్న భక్తులు
- జక్కేపల్లి-వల్లాపురం-చనుల్లి గ్రామ శివారులో స్వయంభుగా వెలిసిన బాల కోటేశ్వర స్వామి
నేటి సాక్షి కోదాడ/అనంతగిరి (సతీష్ నాయక్) : మేళ్లచెరువు జాతర తర్వాత కోదాడ నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి జాతర…బాల కోటేశ్వర స్వామి జాతర…సూర్యాపేట-ఖమ్మం జిల్లాల నడుమ జక్కేపల్లి – వల్లాపురం -చనుపల్లి గ్రామ శివారులో
స్వయంభుగా వెలసిన బాల కోటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఐదు రోజులు అంగరంగ వైభవంగా కన్నుల పండగ జరగనుంది. కళ్యాణ మహోత్సవం ఈనెల 26, 27,28 మార్చి 1,2 తేదీలలో ఊరేగింపులతో, రుద్రాభిషేకాలతోటి, నిర్వహించుకొనే ఈ జాతరకు వేల సంఖ్యలో భక్తులు అధికంగా తరలివస్తారు. 26వ తారీఖున తెల్లవారుజామున 2:00 నుండి అభిషేకములు రాత్రి 10 గంటలకు శ్రీ బాల కోటేశ్వర స్వామి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, 27వ తారీఖున ఉదయం 6 గంటలకు అభిషేకం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహా నైవేద్యం సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఊరేగింపు జక్కపల్లిలో, 28వ తారీకు 6 గంటలకు అభిషేకం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహా నైవేద్యము సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఊరేగింపు వల్లపురం లో, మార్చి ఒకటవ తారీఖున ఆరు గంటలకు అభిషేకం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహా నైవేద్యం సాయంత్రం ఐదు గంటలకు ఊరేగింపు చనుపల్లి లో, రెండవ తారీఖున ఉదయం 10:30కు వసంతసేవ మహా రుద్రాభిషేకం, మహా నైవేద్యం, తీర్థ ప్రసాద వితరణ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సూర్యాపేట ,ఖమ్మం ,వరంగల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వేలాదిగా భక్తుల ఈ జాతర తరలివస్తారు. దేవాలయంలో కొలువై ఉన్న శివుడు కోరుకున్న కోరికలను తీరుస్తారని భక్తుల ప్రగాఢమైన నమ్మకం.వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్టు కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సంగమేశ్వర ప్రసాద్ శర్మ, ధర్మకర్త వేలేటి ఎల్లారెడ్డి, చైర్మన్ పల్లా మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




