మండల విద్యాధికారి, పి. వెంకటేశ్వర్లు

నేటి సాక్షి, మునగాల : విద్యార్థులు అన్వేషణ ద్వారా తమలోని సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చని మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రయోగ పూర్వకంగా స్వయంగా తెలుసుకున్న విషయాలు పూర్తి విజ్ఞానాన్ని అందిస్తాయని ఆయన అన్నారు. అట్టహాసంగా నిర్వహించిన ఈ సైన్స్ దినోత్సవ వేడుకల్లో వివిధ పాఠశాలల నుండి విచ్చేసిన విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిషన్ తో పాటు నృత్య ప్రదర్శనలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.




