- సముదాయాలుగా పట్టణ శివారు ప్రాంతాలు
- పట్టించుకోని అధికారులు
- అధిక ధరలకు విక్రయిస్తున్న మీడియేటర్లు
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : ఫిబ్రవరి 25: ప్రకృతి వనరులలో ఇసుక అనేది ఒకటి… కానీ దానికి ఈ రోజుల్లో వున్న డిమాండ్ గత 10సంవత్సరాల క్రితం లేదు. ఇప్పుడు అదే కొందరి అక్రమార్కులకు, ఇసుక మాఫియాకు ఓ బంగారు గనిలా మారింది. కొత్తగా ఇంటి నిర్మాణము చేపట్టిన ఇంటి యాజమానుల అవసరాలను అసరగా చేసుకొని కొందరు మిదియేటర్లు గద్వాల పట్టణం, గద్వాల పరిసర గ్రామాలలో ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నా సంబధిత అధికారులు పట్టించుకోవడం లేదని పలువురఆరోపిస్తున్నారు. ఆన్ లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకోవడం తెలియని ఇంటి నిర్మాణ యజమానులే మీడియేటర్స్ కు టార్గెట్. ఇంటి యజమానికి ఆన్ లైన్ బుకింగ్ తెలిసినా ఇల్లుకట్టే మెస్ట్రిపైన ఆధారపడి వుంటాడు కాబట్టి ఏ అవసరానికి ఏ రకం ఇసుక కావాలో అదే ఇసుకను మేస్త్రికి చెప్పి బుక్ చేయమంటాడు. దీనిని ఆసరాగా చేసుకున్న ఇసుక మాఫియా మీడియేటర్లు వారి అవసరానిన్ని ఆసరాగా చేసుకొని జేబులు నింపుకుంటున్నారు. వాస్తవానికి ఇంటి యజమాని పేరు గల సిమ్ కార్డు పై ఇసుక ఆన్ లైన్ బుకింగ్ చేయాలి కానీ మిడియేటర్స్ వారీ సొంత సిమ్ తో పాటు వారి సన్నిహితుల సిమ్ తో వాస్తవ ఇంటి నిర్మాణ యజామానుల కన్నా ముందే మధ్యవర్తులు ఆన్ లైన్ లో ఎంతవరకు బుకింగ్ అయితే అంతవరకూ అన్నీ స్లాట్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ప్రభుత్వము నిర్ణయించిన ఆన్ లైన్ బుకింగ్ ఏ రకం ఇసుక ధర అయినా రూ,5900/- నుండి 6100/- వరకు అవుతుంది. ఇదే ఆన్ లైన్ ధర ప్రకారంగా రోజుకు ఒక్క సిమ్మ్ పేరిట 5 ట్రాక్టర్ల లోడ్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇదే అదునుగా మీడియేటర్స్ 4, 5 రకాల సిమ్ కార్డులను ఉపయోగించి దాదాపుగా ఒక్కొక్క మీడియేటరు 10 నుండి 20 ట్రాక్టర్ల ఇసుకను బుకింగ్ చేస్తున్నారు. ఆన్ లైన్ ధరకు అదనంగా కస్టమర్ అవసరాన్ని బట్టి, ఇసుక రకాన్ని బట్టి 6500/- నుండి 8000/- వరకు విక్రయిస్తున్నారు . ఇలా రోజుకు ఒక్కొక మీడియేటర్ ఒక్క ట్రాక్టర్ లోడ్ పై దాదాపుగా 500/- నుండి 1000/- రూపాయలకు పైగా దండుకుంటున్నారు. ప్రస్తుతం పట్టణం, పట్టణ పరిధిలో జరుగుతున్న కొత్త ఇంటి నిర్మానాలను బట్టి రోజుకు ఒక్కొక మీడియేటర్ దాదాపుగా 10 ట్రాక్టర్ల పైగా విక్రయాలు జరుపుతున్నాడని సమాచారం. దీన్ని బట్టి ఒక్కొక్క మధ్యవర్తి వ్యాపారి రోజుకు దాదాపుగా 10వేల వరకు సంపాదిస్తున్నడని తెలుస్తుంది. ఈ సంపాదనను రుచి మారిగిన మీదియేటర్స్ సంబధిత అధికారులను సైతం కై కట్టుకుని మామూల్లను ఎరజూపి మూడు పువ్వులు ఆరు కాయలుగా దర్జాగా ఇసుక దంధా కొనసాగిస్తున్నారు. కాగా వీరు అంతు చిక్కని మోసగాళ్ళు. వీరిని ఎవరైనా సంబధిత శాఖ అధికారి కానీ పోలిస్ కానీ ప్రశ్నిస్తే అన్ని ప్రభుత్వ ఆన్ లైన్ నిబంధనల ప్రకారం మేము ఇసుక బుకింగ్ చేశాము, అదే బుకింగ్ ఇసుక లోడ్ ను తీసుకెళ్తున్నాను అన్నట్టుగానే వునుంది. లోతుగా ఆరా తీస్తే అసలు మోసాలు బయట పడుతాయి. కానీ ఏ అధికారి కూడ మోసం ఎక్కడ జరుగుతుంది, సామాన్య ప్రజల నిత్య అవసరమైన ప్రకృతి వనరులలో ఒక్కటైనా ఇసుక ను కూడా సామాన్యుడు కొనలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అని లోతుగా పరిశీలన చేసి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అదికారులు కానీ ప్రజా ప్రతినిధులు కాని ముందుకు రాకపోవడం గమనార్హం.
వ్యాపారంలో మోసాలు. ఇసుక ఆన్ లైన్ బుకింగ్ చేసిన అడ్రస్ ఒకటీ వుంటే డెలివరి మరొక చోట వుంటుంది. అసలు యజమాని పేరు ఒకటి వుంటే మరొక ఇంటి యజమాని పేరుగల నిర్మాణం దగ్గర ఇసుకను దింపుతారు. ఒకే బుకింగ్ పై రెండు ట్రిప్పులను కూడా తెప్పించుకునే సమర్థులు వున్నారు. ఆన్ లైన్ బుకింగ్ సెల్ ఫోన్ మేసేజ్ లను, బుకింగ్ ఆర్థర్ స్లిప్ లను పరిశీలిస్తే వీరి మోసాలు బయట పడుతాయి. అధిక ధరలకు అమ్మకాలు. ప్రస్తుతము గద్వాల పట్టణం, పరిసర గ్రామాలకు వచ్చే ఇసుక ట్రాక్టర్లు వందల సంఖ్యలో వుంటాయి వీటిలో నిజమైన ఇంటి యజమాని ఆన్ లైన్ బుకింగ్ పదుల సంఖ్యలో వుంటాయి. మిగతావి అన్ని కూడా మధ్యవర్తులు బుకింగ్ చేసుకున్న ట్రాక్టర్లే వుంటాయి. ఈ ఇసుకా మాఫియా మోసాల వల్ల సామాన్యులు ఇసుకను కొనలేని పరిస్థితి నెలకొంది. ఈ అధిక ధరల నుండి విముక్తి కల్పించి నాణ్యమైన ధరలకు ఇసుక సామాన్యునికి ఇసుక చేరువయ్యేలా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు. మాఫియా అడ్డాలు….
ఇసుక మాఫియా మయగాళ్ళ ఆట కట్టాలంటే , వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సంబధిత అధికారులు, పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయాలి. గద్వాల పట్టణ శివారు ప్రాంతాలైన ఐజ రోడ్డు లో గల ఔటర్ రింగ్ రోడ్డు, జమ్మిచేడు గ్రామ సమీప రోడ్డు, సంగాల పార్క్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చెస్తే అక్రమ వ్యాపారుల చిట్టా బయట పడుతుందని పలువురు వ్యక్తం చేస్తున్నారు. సంఘాల, గొన్ పాడు, జమ్మిచేడు, గద్వాల తదితర ప్రాంతాల వారు ఈ అక్రమ వ్యాపారంలో కురువృద్దులని తెలుస్తుంది.




