Tuesday, March 24, 2026

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

  • పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సెంట్రల్ జోన్ డిసిపి
  • ఓటేసేందుకు బారులు తీరిన పట్టభద్రులు
  • కమలాపూర్ లో కాసేపు కరెంట్ సరఫరాకు అంతరాయం

నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజాంబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటింగ్ కూ ఓటర్లు పోటేత్తారు.కమలాపూర్ లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభంలో కరెంట్ సరఫరా అంతరాయం కాగా ఓటర్లు ఇబ్బంది పడ్డారు.ఓటు వేసేందుకు ఓటర్లు పిల్లాపాపలతో పోలింగ్ కేంద్రాలకు తరలిరాగా గంటల కొద్ది క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభంలో ఓటింగ్ మందకోడిగా సాగినప్పటికీ 11 గంటల నుండి ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు.పోలింగ్ కేంద్రాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా సందర్శించారు. అనంతరం ఎన్నికల నియమ నిబంధనల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఓటింగ్ సరళని ఎన్నికల ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News