Tuesday, March 24, 2026

కొండాపురం జడ్పీ హెచ్ ఎస్ హై స్కూల్లో ఇన్ఫినిటీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ

  • విద్యార్థులకు చైర్స్ బీరువాలు బుక్స్ ఎగ్జామ్స్ ప్యాడ్స్ ఉచిత పంపిణీ

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల్ నియోజకవర్గంలోని కేటి దొడ్డి మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో జడ్పీ.హెచ్.ఎస్ హై.స్కూల్ గురువారం. ఇన్ఫినిటీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వారు జెడ్పి.హెచ్.ఎస్ హై స్కూల్లో చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు చైర్స్ బీరువాలు బుక్స్ ఎగ్జామ్స్ ప్యాడ్స్ చెప్పులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండాపురం సీనియర్ నాయకుడు చావిటి కాడి గోవిందరెడ్డి మాట్లాడుతూ.. ఇన్ఫినిటీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వారు స్వయంగా మా గ్రామంలో ఉన్న జడ్పీ హెచ్ ఎస్ పాఠశాలకు వచ్చి పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు ఉచితంగా బుక్స్ ఎగ్జామ్స్ ప్యాడ్స్ చెప్పులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది అని కొనియాడారు. అదే విదంగా ఆ సంస్థ యొక్క బ్రాంచ్ మేనేజర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులకు మీ కంపెనీ ద్వారా సహాయం సహకారాలు అందించే విధంగా ఉండాలని కొండాపురం చావిటి కాడి గోవిందరెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా కొండాపురం ప్రధానొపాధ్యాయులు ( కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు ) మాట్లాడుతూ.. ఇన్ఫినిటీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వారు మా పాఠశాలకు రావడం పిల్లలకు ఉచితంగా చైర్స్ బీరువాలు బుక్స్ ఎగ్జామ్స్ ప్యాడ్స్ చెప్పులు ఇవ్వడం చాలా అభినందనీయం అని అన్నారు. ఆ సంస్థ యొక్క బ్రాంచ్ మేనేజర్ కు కొండాపురం జడ్పీ హెచ్ ఎస్ హైస్కూల్ ఉపాధ్యాయుల బృందం తరఫున విద్యార్థి విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో (ప్రధానోపాధ్యాయులు) కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు ఆ సంస్థ యొక్క ‌ బ్రాంచ్ మేనేజర్ భాష కొండాపురం సీనియర్ నాయకుడు చావిటి కాడి గోవిందరెడ్డి ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News