- ఓట్లు వేసిన నియోజక వర్గ ప్రజలకి ఏం సమాధానం చెప్తారు.
- మీరు ఎట్లా అట ఆడితే అట్లా నమ్మే స్థితిలో గద్వాల్ నియోజక వర్గ ప్రజలు లేరు
- బి ఆర్ ఎస్ పార్టీ మారిన గద్వాల్ ఎమ్మెల్యే క్రిష్ణమోహన్ రెడ్డి పార్టీ సభ్యత్వం ను మరియు పార్టీ నుండి సస్పెండ్ చేయాలి
- బండారి సునంద్ జోగుళాంబ గద్వాల్ జిల్లా బి ఆర్ ఎస్ నాయకులు
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల్: గద్వాల్ జిల్లా కేంద్రం లో విలేకరుల సమావేశంలో బండారి సునంద్ మాట్లాడుతూ.. ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారు గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే మీ సొంత లాభం కోసం ఇష్టం వచ్చినప్పుడల్లా పార్టీలు మారడం సాధారణమైపోయింది. మీకు గతంలో కూడా పార్టీ మారినప్పుడు ఆది పార్టి కండువా కాదు అని చెప్పారు. పార్టీ కండువా కు వేరే కండువకు తేడా తెలియకుండా మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారా? గత ఎనిమిది నెలల నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు మీరు అటెండ్ కాలేదా కాంగ్రెస్ లో జరిగే ప్రతి సభకు మరియు మీటింగ్లకు మరి మీరు అటెండ్ కావడం వాస్తవం కదా! ఇంకెన్నాళ్లు ప్రజలునీ నమ్మిస్తారు. ఇంకెన్ని రోజులు ఓట్లు వేసినా ప్రజలను నిండా ముంచుతారు మిమ్మల్ని చూసి ఓటేయలేదు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ అభివృద్ధిని చూసి గద్వాల నడిగడ్డ ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించిన మాట వాస్తవం కాదా! ఓట్లేసిన ప్రజలను నమ్మించి ఇప్పుడు మీరు ఆటా ఆడుతున్నారు అనేది గద్వాల ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. ఇకపై మీ ఆటలు సాగవు. సుప్రీంకోర్టు లో పార్టీ ఫిరాయింపుల కేసు తుది దశ చేరుకొన్నా తరుణంలో మీ వెన్నులో భయం పుట్టుకొచ్చింది కచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది అని అన్నారు. గద్వాల ప్రజలు మళ్ళీ బిఆర్ఎస్ ని గెలిపిస్తారు మీరు మళ్ళీ పార్టి లోకి రావడానికి వీలు కూడా లేదు. పార్టి మారిన ఎమ్మెల్యే లకు మళ్ళీ బీ ఆర్ ఎస్ లో జాయిన్ చేసుకొనే ప్రసక్తే లేదు అని కేసీఆర్ కేటీఆర్ మొన్న నే చెప్పారు 10 నియోజక వర్గలలో మళ్ళీ ఉప ఎన్నికలు రావడం ఖాయం అని అన్నారు. పార్టి మారిన ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి పార్టీ సభ్యత్వం ను మరియు పార్టి నుండి కూడా సస్పెండ్ చేయాలి అని బండారి సునంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, రవీందర్లు పాల్గొన్నారు.




