- సరదాగా మొదలయ్యే బెట్టింగ్ ఖరీదు ఒక కుటుంబం
- యువత ఈజీ మనీ కోసం వెళ్లి జీవితాన్ని పోగొట్టుకోవద్దు
- సోషల్ మీడియాలో వచ్చే బెట్టింగ్ యాడ్స్ అన్ని మోసాలే
- వెయ్యి పెడితే లక్షలు అసలు రావు
- యువత బెట్టింగ్ ఊబిలో దిగి.. జీవితాన్ని బలి చేసుకోవద్దు
- మునగాల స్టేషన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్

నేటి సాక్షి, మునగాల : ఆన్లైన్ బెట్టింగ్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతుంది. సులభంగా డబ్బులు సంపాదించొచ్చని ఆశతో యువత బెట్టింగులు ఆడుతున్నారని. గురువారం మునగాల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో అమూల్యమైన సందేశాన్ని యువతకు తెలియపరిచారు. అలాగే యువత ఆన్లైన్ బెట్టింగు లకు బానిసలుగా మారి అప్పుల పాలవుతున్నారని తెలిపారు. అప్పులను ఎలా తీర్చాలో అర్థం కాక చివరికి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు. యువత ఇబ్బందులు పడటమే కాకుండా కుటుంబం మొత్తాన్ని అప్పుల ఊబిలోకి నేడుతున్నారని అన్నారు. ఆన్లైన్ బెట్టింగులలో ఎక్కువగా విద్యార్థులు, యువకులు ఉంటున్నారని తెలిపారు. శ్రేయోభిలాషులు, పోలీసులు ఎంత హెచ్చరించినా బెట్టింగుకు బానిసైన వారు వినే పరిస్థితిలో ఉండటం లేదు. అప్పుల ఊబిలో కూరుకు పోయి కుటుంబాలను రోడ్డు మీదకు తెస్తున్నారు. చివరకు ఆస్తులు అమ్మిన సరిపోని అప్పులు చేస్తున్నారని చివరకు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు పెరిగిపోయాయి అన్నారు. నేటి యువత టెక్నాలజీ అరచేతిలోకి వచ్చేసింది అని. చదువును పక్కన పెట్టి మరి స్మార్ట్ ఫోన్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ ఊరించే ప్రకటనలకు ఆకర్షితులవుతున్నా రని. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్ లపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు అవగాహన కల్పిస్తున్నాం. యువత ఆన్లైన్ గేమ్స్ కు బానిస కావడం వారి భవిష్యత్తుకు ప్రమాదకరం. పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని ఎప్పటికప్పుడు వారిపై పర్యావేక్షించాలని తెలిపారు.




