Tuesday, March 24, 2026

ఆడపిల్ల అనగానే చిన్న చూపు చూడకుండా మగ పిల్లలతో సమానంగా స్వేచ్ఛను ఇవ్వాలి

  • లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై అవగాహన
  • లింగ వివక్షత లేని సమాజం కోసం పోస్టర్స్ విడుదల
  • ఇంచార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : సమాజంలో రోజురోజుకు తగ్గిపోతున్న బాలికల శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టిందని దీనిని పటిష్ఠంగా అమలు చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వనపర్తి డిసిఆర్బి డిఎస్పి ఇన్చార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు.గురువారం రోజు జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనమంలో బేటి బచావో- బేటి పడావో పథకం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలోని ఆశా వర్కర్స్ ,ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్స్ కు మహిళ శిశు సంక్షేమ శాఖలోని జిల్లా మహిళా సాధికారిక కేంద్రంజిల్లాలోని అంగన్వాడి సూపర్వైజర్స్,ఆశా కార్యకర్తలకు అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించి వారి ఆధ్వర్యంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఉమామహేశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాలికల నిష్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని దానిని పెంచే విధంగా ప్రతి ఒక్కరూ అందరికీ అవగాహన కల్పించాలని చెప్పారు. అదే విధంగా జిల్లాలో కూడా 1000 మంది బాలులకు 888 మంది మాత్రమే బాలికల శాతం నమోదైనట్లు ఆయన పేర్కొ న్నారు. ఈనిష్పత్తి ఇదే విధంగా కొనసాగినట్లయితే భవిష్యత్లో బాలికల సంఖ్య పూర్తిగా తగ్గిపోయే
ప్రమాదం ఉందని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది ఆర్ ఎంపి వైద్యులు, స్కానింగ్ సెంటర్లు గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్లని నిర్ధారించడంతో తల్లిదండ్రులు భ్రూణ హత్యలకు పాల్పడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం 1994లో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం ( పిసి పి ఎన్ డిటి యాక్ట్ 94) తీసుకొచ్చిందన్నారు. దీనిని పటిష్ఠంగా అమలు చేయడంలో వైద్యులు, పోలీసులు, న్యాయవాదుల పాత్ర కీలకమైనది పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ ఎంపి వైద్యులపై, స్కానింగ్ సెంటర్లపై సరైన నిఘా లేకపో వడం వల్లే విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ బాలికల నిష్పత్తి పడిపోవడానికి కారణం అయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఇమినైజేషన్ ఆఫీసర్ డాక్టర్ పరమాల మాట్లాడుతూ.లింగ నిర్ధారణ వల్ల కలిగే సామాజిక ఆర్థిక ఆరోగ్యపరమైన నష్టాల గురించి చెబుతూ, అనేకసార్లు గర్భం ధరించడం, అబార్షన్ చేయించుకోవడం వల్ల స్త్రీ ఆరోగ్యం నష్టపోతుంది. సమాజంలో స్త్రీల జనాభ తగ్గడం లైంగిక సంబంధ నేరాల పెరుగుదలకు స్త్రీలపై హింస పెరుగుదలకు కారణం అవుతుంది. గర్భం కొనసాగించడం తల్లి శారీరకలేదా మానసిక ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉంటుంది. అబార్షన్ అనేది ప్రభుత్వ ఆసుపత్రి లేదా ప్రభుత్వ అనుమతించిన ఆసుపత్రి లో లేదా క్లినిక్కో మాత్రమే అబార్షన్ చేయవచ్చు.అర్హత ఉన్న డాక్టర్ మాత్రమే అబార్షన్ చేయవచ్చు .మంత్రసానులో, నర్సులు ,నకిలీ డాక్టర్లు, అబార్షన్ చేయడం నేరంమని ఆమె అన్నారు.ఈ కార్య క్రమంలో షీ టీం, భరోసా, డి సి పియు, వారి సేవల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి, కె.సుధారాణి, షీ టీమ్ ఎస్సై, అంజద్, సూపర్డెంట్ అరుంధతి, సిడిపిఓస్, లక్ష్మమ్మ, బాలేశ్వరి, హజీరా,డిస్టిక్ ఇమినైజేషన్ ఆఫీసర్ డాక్టర్ పరిమళ, సిహెచ్ఓ, జ్యోతి, డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్, భాస్కర్, జెండర్ స్పెషలిస్ట్, శ్రీ వాణి, సలోమి, డిసిపిఓ రాంబాబు, భరోసా సెంటర్ కోఆర్డినేటర్, శిరీష, షీ టీం, సిబ్బంది, శ్రీనివాస్, భరోసా సిబ్బంది,జిల్లా అంగన్వాడి సూపర్వైజర్, ఆశ వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News