Tuesday, March 24, 2026

మార్చి 2 న వనపర్తి లో ముఖ్యమంత్రి పర్యటన

  • అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేత
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ శ్రీ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
వనపర్తి జిల్లా లో సహా వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని వారి నివాసంలో గురువారం కలిసి వినతి పత్రాన్ని అందజేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ శ్రీ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి.చిన్నారెడ్డి అందజేసిన వినతి పత్రాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వాటిపై నిర్ణయం తీసుకుంటానని చిన్నారెడ్డి కి హామీనిచ్చారు.మార్చి 2 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి వనపర్తిలో పర్యటించనున్నట్లు జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తిలో తనతోపాటు విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులతో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారని, ఆ తరువాత వనపర్తి జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలలో పాల్గొని అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతారని జిల్లెల చిన్నారెడ్డి వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News