Tuesday, March 24, 2026

సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి

  • స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.మౌర్య

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : స్మార్ట్ సిటీ నిధులతో అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. పాత మునిసిపల్ కార్యాలయం స్థానంలో స్మార్ట్ సిటీ నిధులతో గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్థులలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను ఇంజినీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలసి గురువారం పరిశీలించారు. ఆయా అంతస్తుల్లో గదుల ఏర్పాటును ప్లాన్ లో క్షుణ్ణంగా పరిశీలించారు. తిరుపతి నగరానికే తలమానికంగా నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణ పనులు గడువు లోపు పూర్తి చేయాలని అన్నారు. కార్యాలయంలోని అందరూ విభాగాధిపతులకు గదులు ఉండేలా చూడాలని అన్నారు. కౌన్సిల్ హాల్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి అన్నారు. ప్లాన్ లో ఉన్న విధంగానే కొంత ప్రత్యేకంగా నిర్మాణాలు ఉండాలని అన్నారు. కింది భాగంలో పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్లాన్ ను పరిశీలించి పలు మార్పులను సూచించారు. సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులు గడువు లోపు పూర్తి అయ్యేలా అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పని చేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, స్మార్ట్ సిటీ ఈ.ఈ.రవి, ఏఈకాం ప్రతినిధులు బాలాజి, అనిల్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News