Tuesday, March 24, 2026

మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ను కలిసిన

జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న

నేటి సాక్షి, జమ్మికుంట :

ప్రజా సమస్యలు పరిష్కారంలో బాగంగా పార్టీలకు అతీతంగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ని మర్యాద పూర్వకంగా హైదరాబాద్లో తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ నాయకులు.కొత్తపల్లి గ్రామం నుండి జమ్మికుంట రైల్వే స్టేషన్ బయటకు వెళ్ళేటానికి ఫుట్ బోర్డు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.సత్వరమె సమస్యా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేసారు. గత ఎన్నో ఏళ్లుగా జమ్మికుంట రైల్వే స్టేషన్ నుండి కొత్తపల్లి గ్రామం,దర్మారం, రామన్న పల్లే, ఇతర గ్రామాలకు రైల్వే స్టేషన్ నుండి రైల్వే ట్రాక్ దాటి నడుచుకుంటూ వెళ్ళేవారు.కానీ ఇప్పుడు రైల్వే ట్రాక్ లైన్లు పెంచడం వలన కొత్తపల్లి గ్రామ శివారులో గల రైల్వే కాంపౌండ్ వాల్ కు ఉన్న చిన్న చిన్న దారులను కూడా మూసి వేస్తున్నారు.రైల్యే గోడకు ఆనుకుని 9 ఫీట్ల డ్రైనేజీ నిర్మాణం కూడా చేస్తున్నారు.ఇందువలన కొత్తపల్లి ఇతర గ్రామాల నుండి నడక దారిన రైల్వే స్టేషన్ నుండి జమ్మికుంట పట్టణానికి పొయే వారు విద్యార్థులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, దినసరి కూలీలు, గుమాస్తాలు, పేషెంట్లు,దివ్యాంగులు వీరు చాలా ఇబ్బంది పడుతున్నారనీ,సుమారుగా 20 వేల జనాభా కలిగిన కొత్తపల్లి గ్రామం నిత్యం ప్రతి దినము అన్నీ అవసరాలకు, జీవనోపాధికి జమ్మికుంట మీదనే ఆధారపడి ఉన్నారు.ఈ యొక్క జమ్మికుంట రైల్వే ట్రాక్ దాటడం వలన చాలా మంది రైలు ఢీకొని మరణించడం జరుగుతుందని,గత 10 రోజుల క్రితం ఒక ముస్లిం అమ్మాయి రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మరణించినది. ఇది ఇలా ఉండగా ప్రతి రోజు నిత్యం ఇతర గ్రామాల ప్రజలు కొత్తపల్లి గ్రామం నుండి జమ్మికుంట రైల్వే స్టేషన్ కు వేలాది మంది రైలు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లే టానికి ప్రయాణికులు వస్తుంటారు. అని ఈటెల రాజేందర్ కి పూర్తిగా వివరించి ఫుట్ బోర్డు వంతెన నిర్మాణానికి కృషి చేయాలని వారు కోరారు.ఈటెల రాజేందర్ ఈవి‌షయమై సానుకూలంగా స్పందించి తప్పకుండా ఫుట్ బోర్డు వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని ప్రజల సమస్యల్ని తీర్చుతానని హామీ ఇచ్చారు. అందచేసిన వారిలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు MD. సలీం పాషా, ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News