నేటి సాక్షి , జమ్మికుంట

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలో, ఓటింగ్ కేంద్రం వద్ద బిజెపి నాయకులు ఓటర్లకు సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఓటింగ్ కేంద్రం వద్ద పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరూ కూడా ఉండవద్దని జమ్మికుంట రూలర్ సీఐ వారిని హెచ్చరించారు. కాగా వారు వినిపించుకోకుండా సీఐతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడినుండి పార్టీకి సంబంధించిన నాయకులను పంపించడం జరిగింది.




