Tuesday, March 24, 2026

నాటుసార రహిత జిల్లా కొరకు కృషి చేయాలి

  • నాటుసారా అమ్ముట, తయారు చేయుట, రవాణా చేయుట కలిగి ఉండుట చట్టరీత్యా నేరం
  • 8 సంవత్సరాలు జైలు శిక్ష ఐదు లక్షల వరకు జరిమానా
  • నాటుసారా పై 14405 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదులు చేయవచ్చు
  • జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్
అన్నమయ్య జిల్లాను నాటుసారా రహితంగా రూపొందించేందుకు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో… జిల్లాలో నాటు సారా నిర్మూలనలో భాగంగా కలెక్టర్ అధ్యక్షతన “నవోదయం 2.0” జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… నాటు సారా పై ప్రజల్లో అవగాహన కలిగించి నాటు సారాను పూర్తిగా నిర్మూలించడానికి ఈనెల 19 న రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ మేరకు నాటుసారా అమ్ముట, తయారు చేయుట, రవాణా చేయుట, కలిగి ఉండుట చట్టరీత్యా నేరం అన్నారు. ఇందుకు 8 సంవత్సరాలు జైలు శిక్ష తోపాటు ఐదు లక్షల వరకు జరిమానా ఉంటుందన్నారు. జిల్లాలో ముఖ్యంగా 19 మండలాలలో నాటు సారా తయారు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. ఏ కేటగిరి లో ఆరు గ్రామాలు, బి మరియు సి కేటగిరీలలో 32 చొప్పున గ్రామాలు ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ వారు గుర్తించారన్నారు.
ఈ పంతొమ్మిది మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి నాటు సారా రహితంగా రూపొందించేందుకు కృషి చేయాలన్నారు. నవోదయం 2.0 కార్యక్రమ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేయాలన్నారు. నాటు సారాయి వల్ల కలిగే దుష్ప్రభావాలను గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రభుత్వం ఐదు భాగాలుగా విభజించి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది అన్నారు. మొదటి దశలో ఏ, బి కేటగిరీలోని గ్రామాలను క్షేత్రస్థాయిలో సందర్శించి గ్రామసభలు నిర్వహించి నాటు సారా తయారు చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలి. ప్రతి గ్రామంలో ఎస్ హెచ్ ఓ తాసిల్దారు సచివాలయ సిబ్బంది మరియు విఐఆర్ఓలు గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. నిరంతరం నాటు సారా వృత్తి నుంచి బయటికి రాని వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలి. అలాగే ఆ వృత్తిలో ఉన్నవారు బయటికి వచ్చేలా కళాజాత మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నాటు సారా తయారు చేసేవారు తిరిగి మరలా వృత్తిలోకి వెళ్లకుండా వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన రుణాలు ఇప్పించడం, ఏదైనా అంశంలో నైపుణ్యం ఉన్నవారికి తగు అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. బెల్లం వ్యాపారులతో సమావేశం నిర్వహించి నాటుసార తయారు చేసే వారికి బెల్లం అమ్మకాలు కొనసాగించకుండా అవగాహన పెంచాలన్నారు. అన్ని శాఖలు నిరంతరం పర్యవేక్షణ చేస్తేనే ఇది సాధ్యం అవుతుందని, ఆ మేరకు అధికారులందరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలలో తగు సూచనలు జారీ చేశారు. అంతకుముందుగా నవోదయం 2.0 కార్యక్రమ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News