నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ )
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గొల్లపల్లి మండలం రాపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి రథోత్సవం ఉదయం ఎంతో భక్తిశ్రద్ధలతో నియమానిష్ఠలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు నిన్నటి రాత్రంతా జాగరణలు చేసి ఉదయం డప్పు చప్పులతో గుడి ఆలయం చుట్టూ శివ భక్తులుతొ రథోత్సవం తిప్పారు తండ్రి శంకరా మళ్లీ తిరిగోస్తాం చల్లంగా చూడు అంటూ దేవుడి కి మహిళలు ప్రత్యేక మొక్కులు చెల్లిస్తూ ఇంటిదారి పట్టారు మండల నలుములల నుంచి వచ్చిన భక్తులు తమ బాట పట్టారు జాతర ప్రశాంతంగా ముగియడంతో ఆలయ కమిటీ చైర్మన్ గండ్ర రామారావు ఉపాధ్యక్షులు కొక్కుల భూమయ్య, ప్రధాన కార్యదర్శి కొక్కుల శ్రీనివాస్ కొక్కుల జలంధర్, శ్రీనివాస్ మెరుగు తిరుపతి బొడ్డు గోపాలరావు,బుచ్చన్న,తో పాటు కమిటీ కార్యవర్గ సభ్యులు గ్రామ ప్రముఖులు నల్ల శ్యామ్, తంగేళ్ల సత్తయ్య ,సత్యం రావు అర్జున్, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు




