నేటిసాక్షి బ్యూరో నిజామాబాద్ టి.ఎన్ రమేష్
సాధారణ ఎన్నికల్లో సైతం ఓటు వేసేందుకు ఇంట్లోంచి వెళ్లడానికే జనం ఇష్టపడరు. కానీ తాను తన సతీమణితో కలిసి, గ్రాడ్యుయేట్ ఓటు హక్కును నిజామాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు సక్కి విజయ్ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సక్కి విజయ్ మాట్లాడుతూ, ఇది ఆధిపత్య, అగ్ర వర్గాలకు, సామాన్యులకు మధ్య జరుగుతున్న పోటీ అని ఆయన అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అమ్ముకోవడం నేరమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలి, కానీ అమ్ముకోవద్దని ఆయన సతీ సమేతంగా తాను ఓటు వేసిన, నిర్మల హృదయ పాఠశాల ప్రాంగణంలో ప్రచారం చేయడం పలువురిని ఆకర్షించింది. కొందరు డబ్బును ఇరవేసేందుకు ప్రయత్నించగా విజయ దంపతులు తిరస్కరించడం జరిగింది. రాజ్యాంగం ద్వారా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు చాలా విలువైనదని దానిని అమ్ముకోవడం చట్టరీత్యా నేరమని, కొనేవారు సైతం నేరస్తులేనని విజయ్ దంపతులు ప్రచారం చేశారు. మాల మహానాడు నిజామాబాదు జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్ వారి సతీమణి కళ్యాణి పట్టభద్రుల MLC ఓటు హక్కును నిర్మల హృదయ పాఠశాల లో వినిగించుకొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు పట్టభద్రులు ఎలాంటి ప్రలోభాలకు పాల్బడకుండా నిజాయితీ గా ఓటు హక్కును వినియోగించుకొని నిజాయితీ గల నాయకులను, ఎన్నుకోవడం జరుగుతుంది అని అన్నారు. ప్రధాన పార్టీల నాయకులకు సవాలుగా ఈ ఎలక్షన్స్ నిలుస్తాయని సక్కీ విజయ్ అన్నారు.




