మెదక్ జిల్లా. కొల్చారం. నేటి సాక్షి. (భూమయ్య)
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో సందర్భంగా వైన్స్ లు బంద్ కావడంతో గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల దొంగ జోరుగా సాగుతుంది. ముఖ్యంగా కొల్చారం మండలం రంగంపేట మీది బజార్ కళ్ళు దుకాణం సమీపంలో ఒక్క మందు బాటిల్ పై 50 రూపాయల కమిషన్ తో అమ్ముతున్నారు. ఇంత అవినీతి జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు జాడ ఎక్కడ అనేది అర్థం అవుతలేదు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు పోలీసులు బెల్టు షాపులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్టి విషయమై బెల్ట్ షాప్ యజమాని రిపోర్టర్ ప్రశ్నించగా మేము పోలీసులకు ఎక్సైజ్ అధికారులకు మామూలు ఇస్తున్నామని ముఖాముఖిగా చెప్పడం ఎంతవరకు సమంజసం. మా పైన ఎటువంటి కేసులైన రంగంపేట వైన్స్ యజమానులు చూసుకుంటారని ఆమె అన్నారు.




