Tuesday, March 24, 2026

సీఐ దురుసు ప్రవర్తనపై రెండో రోజు కొనసాగిన న్యాయవాదుల నిరసన

నేటి సాక్షి గోదావరిఖని(రమేష్).

గోదావరిఖని కి చెందిన జూనియర్ న్యాయవాది నామతాబాద్ కిరణ్ జీ పై గోదావరిఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డి దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ ఖని న్యాయవాదులు చేస్తున్న నిరసన గురువారం రెండో రోజుకు చేరుకుంది .ఈ మేరకు గోదావరిఖని బార్ అసోసియేషన్ పిలుపుమేరకు న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. గోదావరిఖనిలోని మూడు మున్సిఫ్ కోర్ట్ ల తో పాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అదనపు జిల్లా న్యాయస్థానంలో కోర్ట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఐలు ఆధ్వర్యంలో వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి దురుసు ప్రవర్తనను నిరసిస్తూ అఖిలభారత న్యాయవాదుల సంఘం ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చందాల శైలజ ఆధ్వర్యంలో న్యాయవాదులు మున్షిప్ కోర్ట్ కాంప్లెక్స్ ఎదుట నిరసన తెలిపారు, సందర్భంగా శైలజ మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఐ న్యాయవాదులపై దురుసు గా ప్రవర్తించడం హేయమైన చర్య అని అన్నారు. ఈ నెల 19 నా మైనర్ బాలున్ని పోలీసులు తీసుకెళ్తే అడిగినందుకు వెళ్లిన న్యాయవాదిపై ఈ విధంగా మాట్లాడడం సిఐ కి తగదని గతంలో ఇదేవిధంగా ప్రవర్తించి న్యాయవాదుల సమక్షంలో క్షమాపణ చెప్పిన సీఐ తిరిగి ఇదేవిధంగా ప్రవర్తించడం దారుణం అన్నారు. ఇప్పటికైనా సీఐ తన ప్రవర్తను మార్చుకోవాలని పోలీస్ స్టేషన్ లకు వచ్చే న్యాయవాదులతో పాటు సామాన్య ప్రజలు సైతం న్యాయం కోసం వస్తారని. అలా వచ్చిన వారిపై దురుసుగా ప్రవర్తించరాదన్నారు .ఇప్పటికైనా సీఐ తన తీరు మార్చుకోవాలని లేనట్లయితే ఆయన బదిలీ అయ్యేంతవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు . కార్యక్రమంలో ఐలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఉమర్ ,టౌన్ అధ్యక్షులు ఆసంపల్లి రవీందర్ కార్యదర్శి రామ టెంకి శ్రీనివాస్ ,కోశాధికారి షానా వాజ్,శ్రీలత ,రేష్మ తో పాటు సీనియర్ జూనియర్ న్యాయవాదులు సీతకారి చంద్రశేఖర్ ,గుడికందుల భూమయ్య ,సానం మురళిచెలికల శ్రీనివాస్ ,దాదా సలాం ,పులిపాక రాజ్ కుమార్ ,రజిత ,తిలక్ తదితరులు ఉన్నారు .

బి ఆర్ ఎస్ నాయకుల మద్దతు .
కాగా న్యాయవాదులు చేస్తున్న నిరసనకు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ,జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి లు సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలిపారు . సందర్భంగా మాట్లాడుతూ… అధికారంలోకి రాకముందు ప్రజా పాలన పేరుతో ప్రజలకు అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం అని తెలిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సొంత ప్రయోజనాలను కోసం అధికారులను వాడుకుంటున్నారని ,ఈనెల 19వ తారీఖున మైనర్ బాలున్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటే అడిగేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లిన కిరణ్ న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించడం దారుణం అని అన్నారు ,ఇప్పటికైనా అధికారులు తమ ప్రవర్తన మార్చుకోవాలని వారు హెచ్చరించారు ,బి ఆర్ ఎస్ లీగల్ సెల్ నాయకులు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు సి సత్యనారాయణ రెడ్డి ,వేల్పుల మురళీధర్ యాదవ్ ,రాకాం దామోదర్ ఎంచర్ల మహేష్, గొట్టె నరేష్ ,దాదా సలాం పులిపాక రాజకుమార్ ,బొల్లి శ్రీకాంత్ టి బి జి కె ఎస్ నాయకులు మాదాసు రామ్మూర్తి తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News