Tuesday, March 24, 2026

చలివేంద్రం ప్రారంభం

  • చలివేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ ఎన్.వి. సుధాకిరణ్

నేటి సాక్షి, బెజ్జంకి:
బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో గ్రామ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ నచ్చరాజు వెంకట సుధాకిరణ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న రోజులలో ఎండల తీవ్రత పెరిగే అవకాశమున్నందున గ్రామ ప్రజల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. గ్రామ పరిరక్షణ కమిటీని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పరిరక్షణ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News