నేటి సాక్షి కోదాడ/అనంతగిరి:
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన పోలంపల్లి వీరయ్య ఇటీవల తాటిచెట్టు పై నుండి కింద పడి మృతి చెందారు. గురువారం ఖానాపురం గ్రామంలో దశదినకర్మ నిర్వహించారు. మృతుడి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా గౌడ ఉద్యోగ సంఘం కోదాడ డివిజన్ తరపున 32 వేల రూపాయలు, సూర్యాపేట పట్టణం ఆర్ వి హాస్పిటల్ తరఫున 10 వేల రూపాయలు మొత్తం 42 వేల రూపాయల సహాయాన్ని వీరయ్య కుటుంబ సభ్యులకు అందించారు.కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. స్పందించి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ఉద్యోగుల సంఘం, ఆర్వి హాస్పిటల్ వారికి ఖానాపురం గౌడ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




