Tuesday, March 24, 2026

జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
జిల్లాలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

అనంతరం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్ సరళిని పర్వవేక్షించి, నస్పూర్ మండలం తీగల్ పహాడ్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తహశిల్దార్ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ, గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని, ఇందు కొరకు జిల్లాలో 60 మంది ప్రిసైడింగ్ అధికారులు, 181 మంది పోలింగ్ అధికారులు, 25 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కొరకు 18 పోలింగ్ కేంద్రాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కొరకు 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 8 కామన్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తమ విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్, వెలుతురు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఆవశ్యకతను తెలుసుకోవాలని, అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శిరీష, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News