బిజెపి నేత రఘునాథ్ వెరబెల్లి
బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బిజెపి కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి నేత రఘునాథ వెరబెల్ల, బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, ఐపీఎస్ కు బిజెపి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నస్పూర్ లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్న బీజేపీ నాయకుడు కమలాకర్ రావు పై నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్ చేయిచేసుకోవడం తో ఎస్ఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేస్తున్న సమయంలో మంచిర్యాల ఏసీపీ, సీఐ ల సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీలు లాక్కొని, దాడి చేయడం, రాళ్లతో దాడి చేయడం వంటి ఘటనకు పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దుర్గం అశోక్, గాజుల ముఖేష్ గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, పురుషోత్తం జాజు, జోగుల శ్రీదేవి, సత్రం రమేశ్, పిట్టల రవి లు పాల్గొన్నారు.




