Tuesday, March 24, 2026

చంద్రశేఖర్ ఆజాద్ ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-

చంద్రశేఖర్ ఆజాద్ ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు మోతె అన్నారు. గురువారం చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణం గల సంఘం కార్యాలయంలో చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించి, ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రాజలింగు మోతే మాట్లాడుతూ, మన దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో స్వర్గీయ చంద్రశేఖర్ ఆజాద్ ముందు వరుసలో ఉంటారన్నారు. తెల్ల దొరల గుండెల్లో రైలు పరిగెత్తించిన సాహతోపేత విప్లవ పంథా ఆజాద్ సొంతమని అన్నారు. దేశభక్తిని అణువణువునా నింపుకొని నా చావు నా చేతుల్లోనే ఉందని.. శత్రువుల చేతుల్లో చావనని శపథం చేసిన దీశాలి ఆయన అని తెలిపారు. ఆజాద్ ఉద్యమస్పూర్తిని యువత పుణికి పుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడు కల్లూరి క్రాంతి పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News