Tuesday, March 24, 2026

ప్రశాంతంగా ఎన్నికలు

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-

జిల్లాలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గల పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం జిల్లాలో ఎన్నికలలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటల నుండి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30,921 మంది ఓటర్లకు గాను 20811 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 67.30 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1664 ఉపాధ్యాయ ఓటర్లకు గాను 1527 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఓటింగ్ శాతం 91.77 గా పోలింగ్ నమోదైంది. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అయినప్పటికీ జిల్లాలో చెదురు ముదురు సంఘటనలు తప్ప జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీలో పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్న అని బిజెపి నేతలు ఆందోళనలు చేపట్టారు. అనంతరం నస్పూర్ ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు డిసిపి ఏ ప్రకాష్ ఐపిఎస్ కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మందమర్రి లో సైతం బిజెపి, కాంగ్రెస్ శ్రేణుల నడుమ స్వల్ప ఘర్షణ చేసుకోగా, ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేశారు. కాగా మార్చి 2న ఓట్ల లెక్కింపు జరిగి, ఫలితాలు వెల్లువడనున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News