-నివాళులు అర్పించిన చెవిరెడ్డి మోహిత్
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
|గుండెపోటుతో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ సిద్ధముని యాదవ్(72) గురువారం ఉదయం మండల పరిధిలోని తొండవాడ సమీపంలోని అగ్రహారంలో గల తన నివాసమంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ అగ్రహారంకు చేరుకుని సిద్ధముని పార్థీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిద్ధముని యాదవ్ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడిగా పార్టీకు, 2014-19 మధ్య సర్పంచ గా పంచాయతీకు విశిష్ట సేవలను అందించారిన ఆయన గుర్తు చేశారు. పంచాయతీ అభివృద్ధిలో ఆయన కీలక భూమికను పోషించారన్నారు. ఆయన పార్టీకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. సిద్ధముని యాదవ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఆయన అంత్యక్రియలను పూర్తి చేశారు.




