Tuesday, March 24, 2026

మానవత్వం చాటుకున్న పోలీస్, మున్సిపల్ సిబ్బంది

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-

అనాధ శవానికి అంత్యక్రియలు జరిపి జిల్లాలోని బెల్లంపల్లి 2 టౌన్ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లాలోని బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్ కవర్లు ఏరుకుంటూ, రోడ్లపై నిద్రిస్తూ జీవనం కొనసాగించే పల్లపు రాజు అనే వ్యక్తి గురువారం బెల్లంపల్లి పట్టణంలోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా రోడ్డుపై పడిపోయి ఉండడంతో అక్కడే ఉంటున్న మహిళ గమనించి, 100కు డయల్ చేసింది. స్పందించిన బెల్లంపల్లి టూ టౌన్ కానిస్టేబుల్ సిహెచ్ రాజీవ్ రతన్, హోంగార్డ్ సంపత్ లు ఘటన స్థలానికి చేరుకొని, రాజు మృతి చెందినట్లుగా నిర్ధారించి, రాజుకు సంబంధిత వ్యక్తులు ఎవరు లేకపోవడంతో మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. రాజు మృతదేహానికి పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంప్రదాయబద్ధంగా అంతక్రియలు జరిపి, మానవత్వం చాటుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News