- సి.ఐ. తిరుమల్ గౌడ్ ఆధ్వర్యంలో పోలిసు బందోబస్తు
- వోటు హక్కును వినియోగించుకున్న పట్టభద్రులు
నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం రోజున పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఆద్యంతం నిరాటంకంగా జరిగాయి. హుజారాబాద్ మండలంలో పట్టభద్రుల ఓట్లు 4795 ఉండగా, 3312 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 69.07 శాతం పోలింగ్ నమోదైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 278 మంది ఉండగా, 263 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 94.00 శాతం ఓటింగ్ నమోదైంది. గురువారం ఉదయం 9 గంటల నుంచే పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ భద్రతా చర్యలను తనిఖీ చేసి, పలు సూచనలు చేశారు. తహశీల్దార్ కనకయ్య ఎన్నికల కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలించారు. పలువురు సాయంత్రం 4 గంటలకు గేట్లు మూసివేసే పరుగులు తీసి తమ వోటు హక్కును వినియోగించుకున్నారు.




