నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గట్టు మండల పరిధిలోని బల్గేరా గ్రామంలో శివరాత్రి పండగ అమావాస్య సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య ఆదేశాల మేరకు బల్గేరా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాల్ పటేల్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక బండి గిరక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం ఆరు జతలు పాల్గొన్నాయి అందులోని మొదటి బహుమతి సిరనగల అయ్యన్న 3016 రెండో బహుమతి రాలకుంట ఈరన్న 2016 మూడో బహుమతి దోర్నాల వీరేష్ 1016 నాలుగో బహుమతి గౌరయ్య గాల శ్రీనివాస్ 516 వీరికి బహుమతులు దాత మాల్ పటేల్ కృష్ణారెడ్డి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బజారి రవి మొగలి బసప్ప నరసింహులు కురువ ముక్కెరయ్య వీరన్న తదితరులు పాల్గొన్నారు.




