- సిఐటీయూ జిల్లా కమిటీ
నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్రసంగం లో కొన్ని పథకాల అమలుకోసం కేటాయింపులు చేశామని చెప్పిన ఆర్థిక మంత్రి జీతాల కోసం పని చేస్తున్న కార్మికులకు బడ్జెట్ లో చోటు ఇవ్వలేదని, ఎటువంటి జీ ఓ ఇవ్వకుండానే మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ లకు గ్రాట్యూటీ అమలు చేసిన ఘనత తమదేనని చెప్పుకోవడం గడ్డి చూపించి గుర్రాన్ని పరుగెత్తిoచడం లాంటిదని సీఐటీయూ అన్నమయ్య జిల్లా కమిటి తరుపున జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రామాంజులు తెలిపారు.శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ,ఆశా, వి ఓ ఏ, గ్రామపంచాయతీ లతో పాటు అనేక స్కీమ్ వర్కర్లు వేతనాల గురంచి ప్రస్తావన లేదని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ప్రత్యేక బోర్డు పునరుద్దరణ లేదని, కూటమి నాయకుల ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీల అమలుకి బడ్జెట్ లో చోటు లేదని తెలిపారు. గత ప్రభుత్వం విచ్చిన్నo వలన అప్పు తీసుకునేశక్తి లేని ఏకైక రాష్ట్రo గా మిగిలిందని బడ్జెట్ ప్రసంగం లో చెబుతూనే 80 కోట్లు అప్పు గురుoచి ఎలా రాశారని తెలిపారు.వేతనాల కోసం, శ్రమ, కూలి చేసే వారికి సంక్షేమ పతకాలిస్తే 2024 ఫలితం తెలిసిందేనన్నారు వ్యవసాయ కార్మికులకు రైతులకు శ్రమ చేసే కార్మికుల జీవితాల అభివృద్ధి లో ఏ మార్పు రాదని,పెరిగిన ధరల ప్రకారం కార్మిక ఉద్యోగుల వేతనాల పెంపు కోసం బడ్జెట్ లోమార్పులు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ అభిప్రాయపడ్డట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సి హెచ్ చంద్రశేఖర్, కోశాధికారి టీ. హరిశర్మ లు పాల్గొన్నారు.




