- మీనం రెడ్డి నితిన్ మౌర్య రెడ్డి
నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు, వసతులు సర్వం సిద్ధం చేసినట్లు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకుడు మీనం రెడ్డి నితిన్ మౌర్య రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గంగమ్మ జాతరలో ఏర్పాటులను వసతులను పరిశీలించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర వచ్చే భక్తులకు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భక్తులకు సౌకర్యాలు సిద్ధం చేసినట్లు లక్కడిపల్లి మండలం టిడిపి ఇన్చార్జ్ యనమల మదనమోహన్ టిడిపి కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.




