- జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి
నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం శాస్త్రీయ సమాజ స్థాపనతో వికసిత భారత్ సాధ్యమవుతుందని జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ పరిశోధనలతో శాస్త్రీయ సమాజాన్ని స్థాపించవచ్చని తద్వారా వికసితభారత్ ఆవిష్కృతమవుతుందని అన్నారు. విద్యార్థి దశ నుండే పరిశోధనల వైపు అడుగులు వేయాలన్నారు. విద్యార్థి తాను ఎంచుకున్న రంగానికి సంబంధించిన నైపుణ్యాలను తప్పనిసరిగా సాధించాలన్నారు. శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఈ యువత సాధికారత సాధించవచ్చు అన్నారు. తద్వారా 2047కు వికసితభారత్ సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శంకరయ్య మాట్లాడుతూ మన పాఠశాలలో ఉన్న వివిధ ప్రయోగశాలలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే విద్యార్థుల జీవితం ఉజ్వలంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్, వకృత్వం పోటీలను నిర్వహించి విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు రామయ్య, రవిశంకర్, ఉమాదేవి, రెడ్డయ్య రెడ్డి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




